బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ కు అన్యూహ్య స్పందన.. ఇప్పటి వరకు 70 వేల దరఖాస్తులు!
Advertisement
ఇటీవల బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి (వీఆర్ఎస్) ఇప్పటి వరకు 70 వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆ సంస్థ చైర్మన్, ఎండీ, పీకే పుర్వార్ తెలిపారు. సంస్థలో మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులుండగా వీరిలో లక్షమందికి వీఆర్ఎస్ అర్హత ఉందని ఆయన అన్నారు. 77 వేలమంది వీఆర్ఎస్ తీసుకుంటారని తాము అంచనా వేసినప్పటికి, ఇప్పటికే 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.

70 వేల నుంచి 80 వేల మందిని వీఆర్ఎస్ ద్వారా బయటికి పంపితే వేతనాల రూపంలో రూ.7 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని సంస్థ అంచనా వేస్తోందన్నారు. బీఎస్ఎన్ఎల్‌లో రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చంటూ.. దీనికి చివరి తేదీ జనవరి 31, 2020 అని తెలిపారు.
Mon, Nov 11, 2019, 10:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View