చంద్రబాబు ఇసుక దీక్షకు మద్దతు కోరిన టీడీపీ.. సొంతంగానే పోరాడతామన్న బీజేపీ!
Advertisement
ఏపీలో ఇసుక కొరత నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తున్న టీడీపీ తమ ఆందోళన తీవ్రం చేయాలనుకుంటోంది. 14న తమ పార్టీ అధినేత చంద్రబాబు 12 గంటల పాటు నిరసన దీక్ష చేపడుతున్నారని, ఈ దీక్షకు బీజేపీ మద్దతును కోరామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

విజయవాడ ధర్నా చౌక్ లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బాబు దీక్ష కొనసాగుతుందని తెలిపాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా భేటీ అయ్యారని, చంద్రబాబు దీక్షకు మద్దతు కావాలని కోరారని తెలిపాయి.

కాగా, ప్రజా సమస్యలపై సొంతంగానే తాము పోరాడాలని నిర్ణయించుకున్నామని కన్నా, ఆలపాటికి తెలిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చంద్రబాబు దీక్షకు జనసేన, సీపీఎం, సీీపీఐ, ఆప్ సంఘీభావం ప్రకటించినట్లు ఆలపాటి తెలిపారు.
Mon, Nov 11, 2019, 08:38 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View