మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఒవైసీ స్పందన
Advertisement
మహారాష్ట్ర రాజకీయం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. శివసేన ప్రతిపాదనకు కాంగ్రెస్ చివరి నిమిషంలో నో చెప్పింది. అయితే, మహా రాజకీయాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తమకు మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ, శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రూపంలో తెలియజేస్తామని వెల్లడించారు.
Mon, Nov 11, 2019, 07:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View