ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సినీ నటుడు విజయ్‌ చందర్‌
Advertisement
కరుణామయుడు చిత్రంలో క్రీస్తుగా, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యంలో సాయిబాబాగా నటించి తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు, వైసీపీ నేత  తెలిదేవర విజయ్ చందర్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చి గౌరవించింది. రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఛైర్మన్ గా నియమించింది. ఈ మేరకు సమాచార, పౌరసంబంధాల కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. విజయ్ చందర్ ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడు కావడం గమనార్హం.
Mon, Nov 11, 2019, 05:49 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View