విడుదలకి సిద్ధమైన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'
Advertisement .a
'నేను వీడని నీడను నేనే' వంటి హారర్ థ్రిల్లర్ చేసిన సందీప్ కిషన్, అందుకు పూర్తి భిన్నమైన కంటెంట్ తో ఈ సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' అనే పూర్తిస్థాయి కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన దర్శకత్వంలో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందేమో చూడాలి.
Mon, Nov 11, 2019, 05:11 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View