మొత్తానికి 'కార్తికేయ 2' బడ్జెట్ తగ్గించాడట
Advertisement
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి చందూ మొండేటి - నిఖిల్ ఇద్దరూ కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే రోజులు గడుస్తున్నాయిగానీ, ఈ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కలేదు. అందుకు కారణం చందూ మొండేటి ప్లాన్ చేసిన బడ్జెట్ అని తెలుస్తోంది.

 కథా పరంగా ఈ సినిమా విదేశాల్లోను చిత్రీకరణ జరుపుకోవలసి వుంది. అక్కడ వివిధ లొకేషన్స్ లో సన్నివేశాలను చిత్రీకరించవలసి వుంది. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువే. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న కారణంగా 20 కోట్ల వరకూ ఆయన బడ్జెట్ వేశాడట. ప్రస్తుతం చందూ మొండేటి, నిఖిల్ ఖాతాల్లో హిట్లు లేవు. అందువలన నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. దాంతో చందూ ఖర్చులు తగ్గిస్తూ .. బడ్జెట్ ను 15 కోట్లకి తీసుకు వచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు ముందుకు కదిలిందని అంటున్నారు.
Mon, Nov 11, 2019, 04:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View