బన్నీకి బాస్ గా కనిపించనున్న పూజా హెగ్డే
Advertisement
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమై ఉంటుంది? ఆమె ఎలా కనిపించనుంది? అనే ఆత్రుత అభిమానుల్లో వుంది. ఈ సినిమాలో ఆమె అల్లు అర్జున్ కి బాస్ పాత్రలో కనిపించనుందట. ఈ విషయాన్ని పూజా హెగ్డేనే బయటపెట్టడం విశేషం.

ఓ కార్పొరేట్ సంస్థలో బన్నీకి తాను బాస్ గా కనిపిస్తానని ఆమె చెప్పింది. తమ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని అంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ .. పూజా హెగ్డే కాంబినేషన్లో 'సామజ వర గమన' అనే పాటను చిత్రీకరిస్తున్నారు. 'టబు' కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.
Mon, Nov 11, 2019, 03:51 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View