'సరిలేరు నీకెవ్వరు'లో రెండు స్పెషల్ సాంగ్స్?
Advertisement
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించిన ఒక తాజా వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమాలో మరో స్పెషల్ సాంగ్ కూడా ఉందనేదే ఆ వార్త సారాంశం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో తమన్నా మెరవనుందనే సంగతి తెలిసిందే. కథలో భాగంగా మరో సందర్భంలో మరో స్పెషల్ సాంగ్ కూడా వస్తుందట. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఒక హీరోయిన్ ను తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. పక్కా మాస్ మసాలా ట్యూన్ తో వచ్చే ఈ పాటలో అలరించే అందాల నాయిక ఎవరో చూడాలి.
Mon, Nov 11, 2019, 02:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View