సంపద సృష్టించడం చేతకాకపోతే చంద్రబాబు వద్ద క్లాసులు తీసుకోండి: పంచుమర్తి అనురాధ
Advertisement
టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సంపద సృష్టించడం చేతకాకపోతే చంద్రబాబు వద్ద క్లాసులు తీసుకోవాలని హితవు పలికారు. రాజధాని కోసం రూ.2 లక్షల కోట్ల సంపదను చంద్రబాబు సమకూర్చితే దాన్ని వల్లకాడులా మార్చేశారంటూ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంపదను సృష్టించడం ఎంత కష్టమో సీఎం జగన్ గ్రహించాలని వ్యాఖ్యానించారు.

విజయవాడలో ప్రభుత్వ ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనురాధ స్పష్టం చేశారు. మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారని, ఇది మిషన్ బిల్డ్ కాదని, మరో క్విడ్ ప్రో కో అని ఆరోపించారు.
Mon, Nov 11, 2019, 02:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View