ఆర్టీసీకి ఎన్ని రోజుల పాటు సాయం చేయాలని ప్రభుత్వం అనడం తగదు: కోదండరాం
Advertisement
ఆర్టీసీని బతికించుకోవడానికే కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఆర్టీసీకి ఎన్ని రోజుల పాటు సాయం చేయాలని ప్రభుత్వం అనడం సరికాదని విమర్శించారు. ఆర్టీసీపై ఖర్చులను పెట్టుబడిగా చూడాలని, ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న డిమాండ్లలో విలీనం అనేది ఒక డిమాండ్ మాత్రమేనని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ డిమాండ్లపై చర్చలు జరపాలని, సమస్యలు పరిష్కరిస్తే సమ్మె ఉండదని కోదండరాం అన్నారు. పోలీసులు అన్నింటినీ శాంతి, భద్రతల కోణంలో చూస్తున్నారని విమర్శించారు. కాగా, ఇటీవల ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఛలో ట్యాంక్ బండ్' ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే.
Mon, Nov 11, 2019, 02:07 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View