నా సినిమాలో కథానాయిక పాత్రకు ముందుగా రష్మీనే అడిగాం!: 'సుడిగాలి' సుధీర్
Advertisement .a
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన క్రేజ్ తో, పలు టీవీ షోలలో సుధీర్ సందడి చేస్తున్నాడు. సినిమాల్లోను చిన్నచిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి హీరోగా అవకాశం వచ్చింది. 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ .."కథను బట్టే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టాము. కామెడీతో పాటు అన్ని రకాల అంశాలు ఇందులో వుంటాయి. ఈ సినిమాలో నా జోడీగా ధన్యా బాలకృష్ణ నటించింది. ముందుగా ఈ పాత్ర కోసం దర్శక నిర్మాతలు రష్మినే సంప్రదించారు. కానీ అప్పటికే ఆమె వేరే సినిమాలు ఒప్పుకుని ఉండటం వలన కుదరలేదు. ఈ సినిమాలో నేను రజనీ స్టైల్ ను .. పవన్ స్టైల్ ను అనుకరించిన తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా విడుదల కానుంది'అని చెప్పాడు.
Mon, Nov 11, 2019, 01:14 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View