కేసీఆర్ పెద్ద మనసు.. తన అటెండర్ కూతురు పెళ్లికి హాజరుకానున్న సీఎం
Advertisement .b
తన వద్ద పని చేసే సిబ్బంది పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో మమకారంతో ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు వ్యక్తగత సహాయకుడిగా ఉండే ఓ యువకుడికి గతంలో కేసీఆర్ దగ్గరుండి పెళ్లి జరిపించారు. తాజాగా ప్రగతి భవన్ లో అటెండర్ గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ కూతురు పెళ్లికి కేసీఆర్ హాజరుకానున్నారు. మియాపూర్ లో ఈ రోజు ఆమె వివాహం జరగనుంది. ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ వివాహానికి సతీసమేతంగా కేసీఆర్ హాజరుకానున్నారు.
Mon, Nov 11, 2019, 12:22 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View