'నేను విరాట్‌ కోహ్లీని' అంటోన్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూతురు.. వీడియో వైరల్
Advertisement
'నేను విరాట్‌ కోహ్లీని' అంటూ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూతురు ఇండీ రే (4) పలికిన పలుకులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తన కూతురు ఇంటి వద్ద బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోను వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల పోస్ట్‌ చేశాడు. తన కూతురు ఇండీ.. కోహ్లీలా అవ్వాలనుకుంటోందని, దీనికి మంచి క్యాప్షన్‌ ఇవ్వండని ఆయన పేర్కొన్నాడు.

డేవిడ్‌ వార్నర్‌ భార్య కాండిస్‌ వార్నర్‌ కూడా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. తమ కూతురు ఎక్కువ సమయం భారత్‌లోనే గడిపిందని, ఆమె కోహ్లీలా ఆడాలనుకుంటోందని పేర్కొంది. దీనిపై అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆమెను క్రికెటర్ ను చేయాలని, నిజంగానే కోహ్లీలా ఆడుతోందని అంటున్నారు. 
Mon, Nov 11, 2019, 12:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View