ఇంట్లో శాంతి పూజలు చేయించిన టీడీపీ నేత... హాజరైన మాజీ మంత్రి కాలవ!
ఏపీ టీడీపీ నేత హనుమంత రెడ్డి, కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న తన ఇంట్లో ప్రత్యేక శాంతి పూజలు చేయించగా, రాష్ట్ర మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు దంపతులు హాజరయ్యారు. దాదాపు 41 రోజుల పాటు ఉపవాస దీక్షలు, పూజలు చేసిన హనుమంతరెడ్డి కుటుంబీకులు, చివరిగా భగళాంబికా అమ్మవారికి విశేష శాంతి పూజలు, హోమాలు చేశారు.

శత్రువర్గం నుంచి రక్షణ, సకల సంపదలు కలగాలన్న కోరికతో భగళాంబికా అమ్మవారికి ఈ పూజలు చేస్తుంటారని వీటిని జరిపించిన పూజారులు వెల్లడించారు. కాలవ దంపతులతో పాటు డీ హీరేహాళ్ మండలానికి చెందిన పలువురు స్థానిక నేతలు, మహిళలు చివరి రోజు హోమాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Mon, Nov 11, 2019, 12:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View