కాంగ్రెస్ తో చర్చలు జరుపుతాం: శరద్ పవార్
- కాంగ్రెస్ తో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న పవార్
- ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎవరితోనూ చర్చించలేదన్న ప్రపుల్ పటేల్
- వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీతో కలవడం తీవ్రమైన విషయమన్న ఎన్సీపీ నేత
Advertisement
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించిన నేపథ్యంలో ముంబయిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ... ఈ రోజు కాంగ్రెస్ తోనూ తాము చర్చలు జరుపుతామని తెలిపారు. కాంగ్రెస్ తో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ మాట్లాడుతూ... శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇప్పటివరకు తాము ఎవరితోనూ చర్చించలేదని స్పష్టం చేశారు. వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు తీవ్రమైన విషయమని, క్షుణ్ణంగా ఆలోచించి తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది.

Mon, Nov 11, 2019, 11:55 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com