ఆకట్టుకుంటోన్న 'ఆకాశం నీ హద్దురా' ఫస్టులుక్
Advertisement .a
జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోకుండా సూర్య తన దూకుడు చూపుతూనే వున్నాడు. అభిమానులకి, తనకి మధ్య సినిమా పరంగా గ్యాప్ రాకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

'గురు' దర్శకురాలిగా సుధ కొంగర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె దర్శకత్వంలో సూర్య చేస్తున్న ఈ  సినిమా, బయోపిక్ కావడమే విశేషం. పైలెట్ 'జీ ఆర్ గోపీనాథ్' జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. తమిళంలో ఈ సినిమాను 'సురారై పోట్రు' అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి వదిలిన సూర్య ఫస్టులుక్ ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా అపర్ణ బాలమురళి నటిస్తుండగా, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు.
Mon, Nov 11, 2019, 11:54 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View