కాచిగూడ స్టేషన్ లో పూర్తిగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
Advertisement
కాచిగూడ స్టేషన్ లో పెను రైలు ప్రమాదం సంభవించింది. సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం వల్ల హంద్రీ ఎక్స్ ప్రెస్ నిలిచి ఉన్న ట్రాక్ పైకి ఫలక్ నుమా నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు వచ్చి ఢీకొంది. రెండో ట్రాక్ పై ప్రయాణించాల్సిన ఎంఎంటీఎస్ రైలు... సిగ్నలింగ్ లోపం వల్ల నాలుగో ట్రాక్ పైకి వెళ్లింది. నేరుగా వెళ్లి హంద్రీ ఎక్స్ ప్రెస్ ను ఢీకొంది.

ఈ ఘటనలో ఎంఎంటీఎస్ కు చెందిన మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. మరో ఆరు బోగీలు పక్క ఉన్న పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీఎస్ రైలు తక్కువ వేగంగా ప్రయాణిస్తుండటంతో భారీ ప్రమాదం తప్పింది. రైలు వేగంగా ప్రయాణించి ఉంటే ఎంతో మంది దుర్మరణం పాలయ్యే అవకాశం ఉండేది. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో, కాచిగూడలో రైళ్ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపి వేశారు.
Mon, Nov 11, 2019, 11:43 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View