పునర్నవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే వదిలేదే లేదు: 'బిగ్ బాస్ 3' విజేత రాహుల్
Advertisement
'బిగ్ బాస్ 3' విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పెద్దగా టాస్క్ లు ఆడకపోయినా, అంతా తన గురించి మాట్లాడుకునేలా చేయగలిగాడు. నటి పునర్నవి .. సింగర్ రాహుల్ మధ్య నడిచిన కొన్ని ఎపిసోడ్స్, వాళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే భావనను కలిగించాయి. వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.

తనకి ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పునర్నవి, తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని రాహుల్ చెప్పినా బయట వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'పునర్నవితో కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తావా?' అని అంతా అడుగుతున్నారు. నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే ఎంతమాత్రం వదులుకోను" అని రాహుల్ తన మనసులోని మాటను చెప్పాడు. మరి ఈ జంటకు ఆ ఛాన్స్ తగులుతుందేమో చూడాలి.
Mon, Nov 11, 2019, 11:29 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View