సెల్వమణితో ఇక్కడే నా లవ్ స్టోరీ: భీమిలిలో రోజా
Advertisement
తాజాగా, విశాఖపట్నం భీమిలీ బీచ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా, తన ప్రేమకథను మరోసారి గుర్తు చేసుకున్నారు. భీమిలీ బీచ్ లలోనే సెల్వమణితో తన ప్రేమ కథ మొదలైందన్నారు. ఆపై పుష్కరకాలం పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

"చామంతి మూవీ... ఇదే భీమిలీ బీచ్ లో సంవత్సరం పాటు షూటింగ్ చేశాము. ఇక్కడే భానుమతిగారు, సెల్వమణిగారు, ప్రశాంత్, నేను... సాంగ్స్... ఆల్ మోస్ట్ వన్ ఇయర్ ఇదే బీచ్ లో మేమున్నాము. నా సినిమా కెరీర్ కి ఇక్కడే నాంది పలకడం గమనించాల్సి విషయం.

అలాగే, నా భర్త సెల్వమణితో ప్రేమ పుట్టిన ప్లేస్ కూడా భీమిలీనే. ఆయన ఇక్కడే ఐ లవ్యూ చెప్పడం, ఆ తరువాత పన్నెండు సంవత్సరాలు ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇద్దరు పిల్లలతో గృహిణిగా కూడా సక్సెస్ ఫుల్ గా ఉన్నానంటే, భీమిలీతో ఉన్న నా అనుబంధాన్ని మీరు ఊహించుకోవచ్చు" అని ఆమె అన్నారు.
Mon, Nov 11, 2019, 11:24 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View