పార్టీ నేతలతో వేర్వేరుగా సోనియా, శరద్ పవార్ కీలక భేటీ.. కాసేపట్లో కీలక ప్రకటన
Advertisement
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, వైఖరిపై తమ తమ పార్టీ నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శదర్ పవార్ భేటీ అయ్యారు. సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఇందులో అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మహారాష్ట్రలో అనుసరించాల్సిన వైఖరిపై తాము పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
 
ముంబయిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో తాజా పరిణామాలు, శివసేనకు మద్దతు వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో ప్రపుల్ పటేల్, సుప్రియా సూలేతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. అంతేగాక, బీజేపీ, శివసేన పార్టీలు కూడా తమ తమ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నాయి.
Mon, Nov 11, 2019, 11:11 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View