హైదరాబాదులో ప్రమాదం.. హంద్రీ ఎక్స్ ప్రెస్ ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు
Advertisement
హైదరాబాదులోని కాచిగూడలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి వచ్చిన హంద్రీ ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపం కారణంగా రెండు రెళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపం వల్ల హంద్రీ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న ట్రాక్ లో కి ఎంఎంటీఎస్ రైలు వచ్చింది. ఫలక్ నుమా నుంచి సికింద్రాబాదుకు ఎంఎంటీఎస్ రైలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, రైలు బోగీలు పక్కకు ఒరిగాయి. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mon, Nov 11, 2019, 11:10 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View