'90 ఎమ్.ఎల్' విడుదల తేదీ ఖరారు
Advertisement .a
కార్తికేయ కథానాయకుడిగా '90 ML' చిత్రం రూపొందింది. అశోక్ గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాకి, శేఖర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా ద్వారా 'నేహా సోలంకి'  కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు.

ఈ పోస్టర్ లోని కార్తికేయ యాక్షన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, "ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చే 3 రొమాంటిక్ సాంగ్స్ ను 'అజర్ బైజాన్'లో చిత్రీకరించాము. ఈ మూడు పాటలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇది కార్తికేయకి గల క్రేజ్ కి .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమా అవుతుంది" అని చెప్పుకొచ్చారు.
Mon, Nov 11, 2019, 11:04 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View