ఎన్డీయే నుంచి వైదొలుగుతున్న శివసేన?.. కేంద్రమంత్రి రాజీనామా.. కాసేపట్లో ఉద్ధవ్ థాకరే ప్రకటన!
Advertisement
బీజేపీ మిత్రపక్షం శివసేన.. ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర పదవుల్లో ఉన్న తమ నేతలతో శివసేన రాజీనామా చేయిస్తోంది. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి తాను ప్రధాని మోదీ సర్కారు నుంచి బయటకు వస్తున్నానని ఈ రోజు ఉదయం అరవింద్ సావంత్ ప్రకటించారు. అసంబద్ధమైన వాతావరణంలో తాను కేంద్ర మంత్రిగా కొనసాగలేనని చెప్పుకొచ్చారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు పొందాలనుకుంటే శివసేన.. ఎన్డీయే నుంచి వైదొలగాలని ఎన్సీపీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్డీయే నుంచి శివసేన బయటకు వస్తున్నట్లు శివసేన అధ్యకుడు ఉద్ధవ్‌ థాకరే కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
Mon, Nov 11, 2019, 10:59 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View