ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన.. అంతా ఓకే అయితే పదవుల పంపకాలు ఇలా ఉండచ్చు!
Advertisement
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన అడుగులు వేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శివసేన, ఎన్సీపీల అధినేతలు ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ మధ్య జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో, కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే... పదవుల పంపకాలు ఈ విధంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. బయటి నుంచి మద్దతిచ్చే కాంగ్రెస్ కు స్పీకర్ పదవిని కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.

అంతా సవ్యంగా జరిగి ప్రభుత్వం ఏర్పడితే కీలక పదవుల పంపకాలు ఇలా ఉండొచ్చు:
ముఖ్యమంత్రి - శివసేన
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ - ఎన్సీపీ
స్పీకర్ - కాంగ్రెస్
రెవెన్యూ, అర్బన్ డెవలప్ మెంట్ - శివసేన
హోం శాఖ, ఆర్థిక శాఖ - ఎన్సీపీ

మరోవైపు, తమ మద్దతు కావాలనుకుంటే బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని ఎన్సీపీ కండిషన్ పెట్టింది. ఇంకోవైపు, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి... ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) నేడు అత్యవసరంగా సమావేశం కాబోతోంది.
Mon, Nov 11, 2019, 10:56 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View