ప్రభాస్ కోసం రాసుకున్న కథలో మెగా హీరో
Advertisement
'సైరా' సినిమాతో దర్శకుడిగా సురేందర్ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. చారిత్రక నేపథ్యం కలిగిన భారీ చిత్రాలను సైతం సమర్ధవంతంగా తెరకెక్కించగలనని నిరూపించుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని కొంతకాలం క్రితమే ఒక కథను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. అయితే 'సైరా' పూర్తయ్యేసరికి ప్రభాస్ 'జాన్' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఈ సినిమా కూడా బహుభాషా చిత్రంగా నిర్మిస్తూ ఉండటం వలన, పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది.

అందువలన సురేందర్ రెడ్డి .. ప్రభాస్ కోసం అనుకున్న కథను ఇటీవల వరుణ్ తేజ్ కి చెప్పాడట. కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటితో వరుణ్ తేజ్ తన తాజా చిత్రాన్ని చేయవలసి వుంది. కానీ సురేందర్ రెడ్డి ప్రాజెక్టు తరువాతనే కిరణ్ కొర్రపాటితో సెట్స్ పైకి వెళ్లాలనే నిర్ణయానికి వరుణ్ తేజ్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. కిరణ్ కొర్రపాటి మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదేమో.
Mon, Nov 11, 2019, 10:30 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View