జమ్మూకశ్మీర్ లో ఇద్దరు ముష్కరులను కాల్చిచంపిన బలగాలు
Advertisement .b
జమ్మూకశ్మీర్ లో ఈ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. బందిపొర జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో... ఈ ఉదయం భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి.

ఈ సందర్భంగా భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అలర్ట్ అయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల మృత దేహాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరు ఏ ఉగ్రసంస్థకు చెందిన వారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Mon, Nov 11, 2019, 10:24 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View