చిరూ తాజా చిత్రం టైటిల్ గా 'గోవిందా హరి గోవింద'?
Advertisement
వినోదాన్నీ .. సందేశాన్ని సమపాళ్లలో కలిపి కథను నడిపించడంలో కొరటాల సిద్ధహస్తుడు. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆయా హీరోల కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అందువల్లనే ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరంజీవి ఆసక్తిని చూపుతూ వచ్చారు. కొరటాల కూడా చిరూ రేంజ్ కి తగిన కథపై కసరత్తు చేస్తూ వచ్చాడు. అలా మొత్తానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది.

ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా సమాచారం. ఈ రెండు పాత్రలను దృష్టిలోపెట్టుకుని ఈ సినిమాకి 'గోవిందాచార్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా దేవాలయ భూముల ఆక్రమణలు .. ఆక్రమణ దారులపై కథానాయకుడి తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుందట. అందువలన 'గోవిందా హరి గోవింద' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.
Mon, Nov 11, 2019, 10:01 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View