సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
*  బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న జయలలిత బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి చెన్నైలో జరుగుతోంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎమ్జీఆర్ పాత్రను ప్రముఖ నటుడు అరవింద్ స్వామి పోషిస్తున్నాడు.
*  'బాహుబలి', 'సాహో' చిత్రాలతో హీరో ప్రభాస్ హిందీలో కూడా మంచి మార్కెట్టును సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తను నటిస్తున్న  చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
*  రవితేజ హీరోగా నటించే సినిమాలో తమిళ నటి వరలక్ష్మి కీలక పాత్ర పోషించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. శ్రుతి హాసన్ కథానాయికగా నటించే ఈ చిత్రంలో వరలక్ష్మి నెగటివ్ టచ్ తో కూడిన పాత్రను చేస్తుందట.   
Mon, Nov 11, 2019, 07:21 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View