అడుగో రానా..! అశోక్ గల్లా తొలి చిత్రం ముహూర్తం షాట్ లో సందడి చేసిన భల్లాలదేవుడు!
Advertisement
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రం ఇవాళ ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ ఓపెనింగ్ షాట్ కు క్లాప్ కొట్టారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ కార్యక్రమానికి హాజరై తన మనవడ్ని ఆశీర్వదించారు. ఈ సినిమాకు గల్లా జయదేవ్ అర్ధాంగి, కృష్ణ గారమ్మాయి పద్మావతి నిర్మాత.

కాగా, టాలీవుడ్ భల్లాలదేవుడు దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రం ఓపెనింగ్ కు విచ్చేశాడు. ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన రానా ఎంతో చలాకీగా దర్శనమిచ్చాడు. స్లిమ్ లుక్ తో చిరునవ్వులు చిందిస్తూ రామ్ చరణ్, పద్మావతి తదితరులతో ఉత్సాహంగా మాట్లాడుతూ కనువిందు చేశాడు. ఈ ఓపెనింగ్ షాట్ కు రానా కెమెరా స్విచాన్ చేసినట్టు తెలుస్తోంది! కాగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి గల్లా కుటుంబ సభ్యులు, ఎంపీ కేశినేని నాని, నటుడు నరేశ్ కూడా హాజరయ్యారు.
Sun, Nov 10, 2019, 02:15 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View