మాల్దీవుల్లో సముద్ర తీరంలో శ్రీముఖి... ఉత్సాహంగా డ్యాన్స్.. వీడియో వైరల్
Advertisement
తెలుగు బిగ్‌బాస్‌-3లో అలరించిన యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఆర్జే చైతూ, యాంకర్‌ విష్ణుప్రియతో పాటు పలువురు స్నేహితులతో కలిసి ఆమె సరదాగా గడుపుతోంది. బిగ్ బాస్ లో గెలిస్తే మాల్దీవులకు వెళతానని శ్రీముఖి ఇటీవల చెప్పింది. అయితే, ఈ సీజన్ విజేతగా రాహుల్ నిలిచాడు. అయినప్పటికీ, ఆమె మాల్దీవులకు వెళ్లింది.
    మాల్దీవుల్లో పర్యటిస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోను శ్రీముఖి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆమె తీసుకున్న ఫొటోలు అలరిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3... 17 మంది కంటెస్టెంట్స్‌తో దాదాపు 100 రోజుల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.
View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

Sun, Nov 10, 2019, 12:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View