అస‌భ్య‌క‌ర ప్ర‌శ్న‌లు అడిగి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: హీరోయిన్ నివేదా థామ‌స్
Advertisement
ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా అభిమానులతో చాట్ చేస్తోన్న హీరోయిన్ నివేదా థామస్ కు చేదు అనుభవం ఎదురైంది. కొంద‌రు నెటిజన్లు తనను అస‌భ్య‌క‌ర ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బంది పెట్టారని ఆమె తెలిపింది. దీంతో తనతో చాట్ చేయడానికి సమయం కేటాయించిన వారంద‌రికి కృతజ్ఞతలు అంటూ ఆమె చాటింగ్ ను ఆపేశారు. చాలా మంది ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చానని, కొందరు అడిగిన అస‌భ్య‌క‌ర ప్ర‌శ్న‌లు తనను చాలా ఇబ్బంది పెట్టాయని ఆమె తెలిపింది.

నెటిజన్లు చాట్ చేసేది మ‌నిషితోనే అనే విష‌యం మ‌రచిపోవద్దని, అంద‌రికి మ‌ర్యాద ఇవ్వాలని నివేదా థామస్ కోరింది. త్వ‌ర‌లో మ‌ళ్లీ క‌లుద్దాం అటూ గుడ్ బై చెప్పేసింది. కాగా, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అందులో ఆమె తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
Sun, Nov 10, 2019, 10:26 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View