రాహుల్ సిప్లిగంజ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు
Advertisement
బిగ్ బాస్ -3 రియాల్టీ షో విజేత రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఈ రోజు మంత్రిని రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ విజేతగా నిలవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. బిగ్ బాస్-3 లో ఫైనల్ కు చేరిన రాహుల్, శ్రీముఖిల మధ్య పోటీ ఉత్కంఠ రేపింది. ప్రేక్షకుల ఓటింగ్ రాహుల్ వైపు ఉండటంతో ఆయన విజేతగా నిలిచారు.
Sat, Nov 09, 2019, 06:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View