ఎన్టీఆర్ మూవీలో నేను చేసిన ఆ సీన్ చూస్తే నాకు ఇప్పటికీ ఒళ్లు పులకరిస్తుంది: 'షావుకారు' జానకి
Advertisement .b
'షావుకారు' సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి జానకి నటించారు. ఆ సినిమాను గురించి మాట్లాడుతూ ఆమె ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. 'షావుకారు' సినిమా సమయానికి నేను చాలా అమాయకంగా ఉండే దానిని. రామారావుగారు కూడా అప్పటికి ఇంకా ఫేమస్ కాలేదు. కాకపోతే ఆ సినిమా సమయానికే ఆయన చాలా అందంగా ఉండేవారు. ఆ సినిమా తరువాత అయన అంచలంచెలుగా ఎదిగిపోయారు.

ఆయనతో నేను చేసిన సినిమాల్లో 'షావుకారు'తో పాటు 'వేంకటేశ్వర మహాత్మ్యం' అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో నేను 'ఎరుకలసాని' వేషంలో కనిపిస్తాను. ఎన్టీఆర్ నా రూపంలో పద్మావతి ఇంటికి వస్తారన్న మాట. ఆ సమయంలో ఎన్టీఆర్ రూపాన్ని డిజాల్వ్ చేస్తూ నన్ను చూపిస్తారు. అలా ఆయనలో నుంచి నేను రావడం అనే షాట్ చూసినప్పుడల్లా నా ఒళ్లు పులకరిస్తుంది" అని చెప్పుకొచ్చారు.
Sat, Nov 09, 2019, 04:42 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View