'దర్బార్' కోసం ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి కారణమదేనట
Advertisement
రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ 'దర్బార్' సినిమాను రూపొందించాడు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. రజనీకాంత్ క్రేజ్ కి తగినట్టుగానే ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారట. పోలీస్ ఆఫీసర్ గా రజనీ నటించిన ఈ సినిమా కోసం 130 కోట్ల వరకూ ఖర్చు చేశారట.

రజనీ పారితోషికం కాకుండానే లైకా ప్రొడక్షన్స్ వారు ఈ మొత్తం ఖర్చు చేయడం విశేషం. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇతర దేశాల్లోను రజనీ అభిమానులు ఉండటం వలన, అక్కడ కూడా భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. దేశ విదేశాల్లో రజనీకి గల ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకునే లైకా వారు ఈ స్థాయిలో ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు.
Sat, Nov 09, 2019, 03:07 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View