మహేశ్ బాబు చేతుల మీదుగా నరేశ్ మూవీ ట్రైలర్ రిలీజ్
Advertisement
తెలుగు సినిమాకి కొత్త రూపురేఖలు దిద్ది .. సరికొత్త మార్పు వైపుకు మళ్లించిన నిర్మాత 'రఘుపతి వెంకయ్య నాయుడు'. తెలుగు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు .. సాంకేతిక నైపుణ్యాన్ని జోడించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అలా ఆయన 'తెలుగు చలన చిత్ర పితామహుడు' అనిపించుకున్నారు. 'రఘుపతి వెంకయ్య నాయుడు' పేరుతో ఆయన జీవితచరిత్ర రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

ఈ నెల 29న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా టీమ్ కి మహేశ్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. రఘుపతి వెంకయ్య నాయుడు బాల్యం .. యవ్వనం .. సినిమాల పట్ల ఆయనకి ఆసక్తి పెరిగిన తీరు .. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఆయన పడే తపన .. ఆయన చివరి రోజులకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సీనియర్ నరేశ్ ప్రధాన పాత్రధారిగా సతీశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి, బాబ్జీ దర్శకుడిగా వ్యవహరించాడు.
Sat, Nov 09, 2019, 02:47 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View