డబ్బు కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు: 'షావుకారు' జానకి
Advertisement
తెలుగు తెరకి 'షావుకారు' సినిమాతో జానకి పరిచయమైంది. ఆ సినిమా నుంచి 'షావుకారు' అనేది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. అలాంటి 'షావుకారు' జానకి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నా చెల్లెలు కృష్ణకుమారి చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేది. సినిమాలతో బిజీగా వున్నప్పుడే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఆ విషయమే అప్పట్లో నాకు చాలా బాధను కలిగించేది.

నేను మాత్రం నిలకడగా కొంతకాలం పాటు చిత్రపరిశ్రమలోనే ఉండాలని భావించాను. ఎందుకంటే నా బ్రతుకు తెరువు కోసం .. నా పిల్లల భవిష్యత్తు కోసం. ఈ అవసరాలు వున్నాయి కదా అని నేను డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదు. డబ్బు కోసం ఏ పాత్రను పడితే ఆ పాత్రను ఒప్పుకోలేదు. నాకు ముందుచూపు ఎక్కువ .. అందువల్లనే మంచి పాత్రలు మాత్రమే చేశాను. అవే నాకు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. జగ్గయ్య వంటి వారి సరసన చేసే అవకాశాలను ఇచ్చాయి .. ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేశాయి" అని చెప్పుకొచ్చారు.
Sat, Nov 09, 2019, 01:58 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View