ఏదో ఓ సమయంలో భారత్ లో పర్యటిస్తా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Advertisement
ఏదో ఓ సమయంలో తాను భారత్ లో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ తో అమెరికా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తోందని చెప్పారు.  ఇరు దేశాల మధ్య చాలా అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని తెలిపారు. తాను ఇటీవలే హ్యూస్టన్ లో మోదీతో కలిసి వేదికను పంచుకున్నానని గుర్తు చేశారు.

కాగా, ఇటీవల హ్యూస్టన్ లో నిర్వహించిన 'హౌడీ-మోదీ' కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ ని కుటుంబసమేతంగా భారత పర్యటనకు రావాలని మోదీ ఆహ్వానించారు. ఇటీవల భారత ఉత్పత్తులపై అమెరికా  సుంకాలు పెంచడంతో భారత్ కూడా ఆ దేశ వస్తువులపై సుంకాలు పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు తలెత్తాయి. వీటిని తొలగించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Sat, Nov 09, 2019, 01:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View