అయోధ్య తుది తీర్పు: అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదే!
Advertisement
అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడైంది. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే, ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో 'అయోధ్య ట్రస్ట్'ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ కేసుకు అధికరణం 47 వర్తించదని సీజేఐ గొగోయ్ స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని అన్నారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు ఈ కేసులో వ్యాజ్యం దాఖలు చేసిందని చెప్పారు. తమ నిర్ణయానికి ముందు ఇరు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
Sat, Nov 09, 2019, 11:34 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View