పాన్‌ కార్డు లేదా.. ఆందోళన అక్కర్లేదు.. ఆధార్‌ నంబరిచ్చినా చాలంటున్న కేంద్రం
Advertisement
పాన్‌ కార్డు...కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అన్నది ఇప్పటి వరకు ఉన్న నిబంధన. లేకుంటే లావాదేవీల నిర్వహణకు వీలుకాక వెనుదిరిగే సందర్భాలు వుంటాయి. ఈ పరిస్థితుల్లో ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇకపై పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఇంటర్‌ చేంజ్‌బిలిటీకి ఆమోదం తెలిపింది. దీన్ని అనుసరించి ఒకవేళ ఎక్కడైనా పాన్‌ కార్డు ఇవ్వాల్సిన అవసరం వస్తే ఆధార్‌ నంబర్‌ను చూపి పని పూర్తి చేసుకోవచ్చు. ఈ వార్షిక బడ్జెట్‌లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాన్‌, ఆధార్‌ ఇంటర్‌ చేంజ్‌బిలిటీకి ప్రతిపాదించారు. తాజాగా దీన్ని ఆమోదించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తన రూల్స్‌లో నోటిఫై చేసింది.

ఈ నిర్ణయం ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఇది ఊరటనిచ్చే అంశం. అలాగే బ్యాంకులో లావాదేవీల సందర్భంగా కూడా పాన్‌ నంబరు కోరేటప్పుడు ఆధార్‌ నంబరు ఇవ్వడం ద్వారా పని పూర్తి చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసినట్టు ఆదాయ పన్నుశాఖ స్పష్టం చేసింది.
Sat, Nov 09, 2019, 11:08 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View