తెలుగులో సీనియర్ నటీమణులకు సరైన గుర్తింపు లేకపోవడం బాధగా వుంది: రాజశ్రీ
Advertisement
తెలుగు తెరపై అందమైన చిరునవ్వుతో ఆకట్టుకున్న అలనాటి కథానాయికలలో రాజశ్రీ ముందువరుసలో కనిపిస్తారు. అలాంటి రాజశ్రీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "తెలుగులో సీనియర్ హీరోయిన్లకు సరైన గుర్తింపు లేకపోవడం నాకు బాధ కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎస్వీ రంగారావు .. రేలంగి .. సూర్యకాంతం గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఎంతటి గొప్ప ఆర్టిస్టులు వాళ్లు!

అలాంటి ఆర్టిస్టులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ల పేరుతో ఇతర ఆర్టిస్టులకు అవార్డులు ఇస్తే ఎంత బాగుంటుంది. తమిళనాడువారు నన్ను గుర్తుపెట్టుకుని అమెరికా నుంచి నన్ను పిలిపించి మరీ 'కన్నాంబ' గారి పేరున అవార్డును ఇచ్చారు. తెలుగులో తొలి హీరోయిన్ కన్నాంబ గారని చెప్పుకోవచ్చు. ఆ తరం నటిని వాళ్లు గుర్తుపెట్టుకోవడం విశేషం. అలాంటి ఆదరణ తెలుగువారి నుంచి లేకపోవడం దురదృష్టకరం" అని చెప్పుకొచ్చారు.
Sat, Nov 09, 2019, 10:31 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View