ఒంగోలు 'షీ మ్యాన్' సుమలత కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి.. ప్రేమ లేఖలు, విగ్ స్వాధీనం
Advertisement
మాయలేడి సుమలత కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. మగవాడిలా వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న పోలీసులు ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కంఠం మగవాడిలా ఉండడంతో తలకు విగ్ ధరించి మగవాడిలా చలామణి అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. తాజా కేసులో ఆమె రిమాండ్‌లో ఉంది.

శుక్రవారం ఒంగోలు మారుతీనగర్‌లోని సుమలత ఇంటికి వెళ్లి సోదాలు చేసిన పోలీసులు ఏడు ప్రేమ లేఖలను సీజ్ చేశారు. వాటిలో మూడు లేఖలు ‘హాయ్’ పేరుతో ఉండగా, మిగతా నాలుగు ‘సాయిచరణ్’ పేరుతో ఉన్నాయి. దీంతో ఆమె సాయిచరణ్ పేరుతో మగవాడిలా చలామణి అయినట్టు పోలీసులు నిర్ధారించారు.

అలాగే, ఆమె ఇంటి నుంచి మగవారు ధరించే విగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని సాయంతో ఆమె పొడవాటి జడను కప్పి ఉంచినట్టు నిర్ధారించారు. ఇక, ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ప్రేమ లేఖల్లో కింద సంతకం లేకపోవడంతో వాటిని ఎవరు రాసి ఉంటారనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితురాలు సుమలత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ద్వారా ఆమె ‘షీ మ్యాన్’లా ఎందుకు వ్యవహరిస్తోందో తెలుసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.
Sat, Nov 09, 2019, 10:13 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View