భారీ చారిత్రక చిత్రం కోసం థాయ్ లాండ్ కి మణిరత్నం టీమ్
Advertisement
సామాజిక పరిస్థితులు .. కట్టుబాట్లు .. ఆ రెండింటితో పెనవేసుకున్న ప్రేమకథలతో మణిరత్నం సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. వాస్తవానికి దగ్గరగా కథలు .. సహజత్వానికి చేరువగా పాత్రలు మసలుకుంటూ ఉంటాయి గనుకనే ఆయన చిత్రాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంటాయి. అలాంటి మణిరత్నం ఈ సారి చారిత్రక నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు.

చోళరాజుల కాలంనాటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తమిళంలో ఈ సినిమాకి 'పొన్నియిన్ సెల్వన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. విక్రమ్ .. జయం రవి .. కార్తీ .. మోహన్ బాబు .. ఐశ్వర్య రాయ్ .. కీర్తి సురేశ్ వంటి తారలను ఇప్పటికే ఎంపిక చేేశారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ను థాయ్ లాండ్ లో ప్లాన్ చేశారు. డిసెంబర్ 2వ వారం నుంచి అక్కడ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. షూటింగుకు వారం ముందుగానే ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది.
Sat, Nov 09, 2019, 09:56 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View