అయోధ్యపై తీర్పు నేపథ్యంలో.. సోమవారం వరకు యూపీలో విద్యా సంస్థలకు సెలవులు
Advertisement
అయోధ్యపై నేడు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సోమవారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పాఠశాలలు, కళాశాలలతోపాటు శిక్షణ సంస్థలకు సెలవులు ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అవసరమైతే రక్షణ దళాలను తరలించేందుకు విమానాలను సిద్ధంగా ఉంచారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు డివిజనల్ కమిషనర్లు, ఏడీజీపీ, ఐజీ స్థాయి అధికారులు క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు.
Sat, Nov 09, 2019, 09:08 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View