సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
    *  హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'ఫ్రోజన్ 2'ని భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో ఎల్సా పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పింది. తాజాగా తమిళ వెర్షన్ లో ఆ పాత్రకు శ్రుతి హాసన్ డబ్బింగ్ చెప్పిందట.
*  నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎంత మంచి వాడవురా' చిత్రం విడుదల డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 15న విడుదల చేస్తున్నట్టు కల్యాణ్ రామ్ ప్రకటించాడు. దీంతో దీని విడుదల వాయిదా పడుతుందన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
*  తెలుగులో పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా వున్న మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ నిర్మాతలకు అనుకూలంగా వుండడం కోసం తాజాగా హైదరాబాదులో కూడా ఓ రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఆయనకు చెన్నైలో కూడా రికార్డింగ్ స్టూడియో వుంది.  
Sat, Nov 09, 2019, 07:37 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View