నేడు యథావిధిగా పనిచేయనున్న తెలంగాణ విద్యాసంస్థలు
Advertisement
నేడు రెండో శనివారమైనా తెలంగాణ విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు, యూనివర్సిటీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. సెలవుల పొడిగింపు కారణంగా సిలబస్ పెండింగ్‌లో ఉందని, దానిని సకాలంలో పూర్తి చేసేందుకు ఇకపై ప్రతీ రెండో శనివారం విద్యాసంస్థలు పనిచేస్తాయని వివరించాయి. 2020 మార్చి వరకూ ఇదే మార్గదర్శకం అమలవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.
Sat, Nov 09, 2019, 07:05 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View