గ్రూప్ ఫొటోతో సందడి చేసిన 'సరిలేరు నీకెవ్వరు' టీమ్!
Advertisement
మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబుకు తోడు భారీ తారాగణం, అనిల్ రావిపూడి టేకింగ్ సినిమా రేంజ్ ను అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి. తాజాగా ఈ చిత్ర బృందం మొత్తం ఓ గ్రూప్ ఫొటోతో సందడి చేసింది.

మహేశ్ బాబు, రష్మిక, ప్రకాశ్ రాజ్, విజయశాంతి, రఘుబాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, ఇతర నటీనటులు, టెక్నీషియన్లంతా కొలువుదీరిన ఈ ఫొటో సూపర్ స్టార్ అభిమానులకు కనులపండుగే అని చెప్పాలి. కేరళలో షూటింగ్ సందర్భంగా యూనిట్ సభ్యులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు.

కాగా, 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్ర పోషిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Fri, Nov 08, 2019, 08:31 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View