చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం
Advertisement .a
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద చిత్తూరు-బెంగళూరు నేషనల్ హైవేపై ఓ కంటెయినర్ వాహనాలపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. కంటెయినర్ ఓ ఆటో, వ్యాన్, బైక్ ను ఢీకొని బోల్తా పడిపోవడంతో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు!
కంటెయినర్ డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు.

ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పలమనేరు ఆసుపత్రికి తరలించారు. కాగా, బోల్తాపడిన కంటెయినర్ కింద ఓ బైక్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా సందర్శించారు.
Fri, Nov 08, 2019, 07:25 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View