మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా
Advertisement .a
మహారాష్ట్రలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో ఆయన తన మంత్రులతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలనలో సహకరించిన సహచర పార్టీ నాయకులు, శివసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Fri, Nov 08, 2019, 06:37 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View