మిసెస్ ఇండియా తెలంగాణ-2019 టైటిల్ గెలిచిన లేడీ డాక్టర్
Advertisement
ఇటీవల కాలంలో వివాహితలకు కూడా అందాల పోటీలు నిర్వహించడం పరిపాటిగా మారింది. తాజాగా, మిసెస్ ఇండియా తెలంగాణ-2019 అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సూపర్ క్లాసిక్ కేటగిరీలో డాక్టర్ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు. లండన్ లో ప్రఖ్యాత వైద్యురాలిగా శోభాదేవికి గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్ లో వైద్య సేవలు అందించారు.

అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్ వచ్చిన శోభాదేవి హైదరాబాద్ లోని లైఫ్ స్పాన్ ఆసుపత్రిలో డయాబెటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్ రంగం ప్రవృత్తి అని చెప్పాలి. ఆ మక్కువతోనే మిసెస్ ఇండియా తెలంగాణ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు ఏకంగా టైటిల్ ఎగరేసుకెళ్లారు. ఇంతటి ఘనత సాధించిన శోభాదేవి వయసు 63 సంవత్సరాలంటే ఎవరూ నమ్మలేరు.
Fri, Nov 08, 2019, 05:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View