మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నేను జోక్యం చేసుకోను : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని గడ్కరీ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. శివసేన చెబుతున్నట్లు ఇరు పార్టీల మధ్య పాలనపై 50-50 ఒప్పందం జరగలేదన్నారు.

మరోపక్క, బీజేపీ సీఎం పదవిని తమకు ఇస్తానంటేనే ఆ పార్టీతో సంప్రదింపులు జరుగుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు సీఎం అవుతారన్న ఉత్కంఠ నెలకొంది.
Fri, Nov 08, 2019, 04:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View